చెవిపోటు తరచూ వేధిస్తోందా.. ఈ చిట్కాలను పాటిస్తే ఆ సమస్యలకు చెక్!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది చెవిపోటు సమస్యతో బాధ పడుతున్నారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమయంలో చెవినొప్పి వేధించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు చెవిలో ఉండడం వల్ల చెవిపోటు ఎక్కువగా వేధించే అవకాశాలు ఉంటాయి. చెవిలో పురుగు, ఇతర కీటకాలు దూరినా కూడా చెవిపోటు సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఇప్పటికే చెవుడు, ఇతర సమస్యలతో బాధ పడేవాళ్లకు చెవిపోటు వచ్చే అవకాశాలు అయితే మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కొంతమంది చెవిలో శబ్దాలు రావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

మన శరీరంలోని సున్నితమైన అవయవాలలో చెవులు కూడా ఒకటి కాగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కోల్డ్ కంప్రెస్ వాడటం ద్వారా చెవినొప్పి దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. చెవినొప్పికి పవర్‌ఫుల్, ఈజీ ఇంటి చిట్కాగా పచ్చి అల్లం ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గేందుకు, ఇన్‌ఫెక్షన్స్‌కి వ్యతిరేకంగా పోరాడేందుకు, చెవిలో, చుట్టుపక్కల నొప్పి, చికాకుని దూరం చేయడానికి ఉపయోగపడతాయి.

అల్లం రసం చెవి నొప్పికి నివారణగా ఉపయోగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఓ అంగుళం పచ్చి అల్లం తురుము, రసం తీసి.. చెవిలో రెండు చుక్కలు వేసి చెవుల నొప్పులకి పై పూతగా రాస్తే మంచిది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హీలింగ్ లక్షణాలను కలిగి ఉన్న టీ ట్రీ ఆయిల్ సైతం చెవి నొప్పికి దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఆలివ్ ఆయిల్ సహాయంతో కూడా చెవినొప్పి దూరమవుతుంది.