మీ కళ్లు తరచూ ఎర్రబడుతున్నాయా.. ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే!

మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో కళ్లు ఎర్రబడుతుంటాయి. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా కళ్లు ఎర్రబడటం కొన్నిసార్లు వ్యాధులకు సంకేతం అవుతుంది. కళ్లల్లో దుమ్ము, ధూళి పడటంతో పాటు ఎక్కువ సమయం పాటు టీవీ, మొబైల్ ఫోన్లను చూడటం వల్ల కూడా కళ్లు ఎర్రబడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కళ్లు ఎర్రబడిన సమయంలో కళ్లను శుభ్రంగా కడిగి ఐ డ్రాప్స్ వేసుకుంటే మంచిది.

ఐ డ్రాప్స్ వేసుకున్నా ఫలితం లేకపోతే మాత్రం వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. కళ్లు ఎర్రబడటం కరోనా లక్షణం కూడా కావడం గమనార్హం. కళ్లు ఎర్రబడటం వల్ల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కంటి సమస్యలు ఆందోళనతో పాటు ఒత్తిడిని కూడా కలిగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కంటి  సమస్యలు చాలా ఆందోళనతో పాటు ఒత్తిడిని కలిగించే అవకాశాలు ఉంటాయి. కంటిలోని చిన్న రక్తనాళాలు ఎర్రబడినప్పుడు లేదా నాళాలు వాచినప్పుడు కళ్లు ఎర్రబడే అవకాశాలు అయితే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అలోవెరా జెల్ ను వాడటం ద్వారా కంటి వాపును సులువుగా తగ్గించవచ్చు.

కళ్లు ఎర్రగా ఉంటే కొబ్బరినూనెను రాసి కూడా తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు. అయితే వైద్యుల సలహాలు తీసుకుని మాత్రమే ఈ చిట్కాను పాటించాలి. కంటి చుట్టూ ఐస్ పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిది.