కాళ్ల నరాల నొప్పులకు కారణాలు తెలుసా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

కాళ్ళ నరాల నొప్పులు వివిధ కారణాల వల్ల వస్తాయి. వాటిలో కొన్ని సాధారణ కారణాలు సైతం ఉన్నాయి. వెన్నుపాముపై ఒత్తిడి పడటం వల్ల చాలా సందర్భాల్లో నరాల నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తుంటి నరానికి గాయం లేదా చికాకు వలన కాలులో నొప్పి వస్తుంది. మధుమేహం వల్ల నరాలకు నష్టం ఏర్పడి నరాల నొప్పి వస్తుంది. పాదం నరాలకు గాయం లేదా చికాకు వలన నొప్పి వస్తుంది.

పాదం నరాల మీద ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. శరీరంలోని నరాలు దెబ్బతినడం వల్ల నరాల నొప్పి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా నరాల నొప్పికి కారణం కావచ్చు. సిరల లోపల రక్తం బ్యాక్ అప్ అవడం లేదా ఇతర రక్తం గడ్డ కట్టే సమస్యలు కూడా నరాల నొప్పికి కారణం కావచ్చు. డీ హైడ్రేషన్, తక్కువ పొటాషియం లేదా మెగ్నీషియం స్థాయిలు కూడా ఇందుకు కారణం అవుతాయి.

వెన్నుపూసల మధ్య స్పేస్ తగ్గిపోవడం, వెన్నుపూసలు ముందుకు జారడం లేదా ఇతర వెన్నెముక సమస్యలు కూడా నరాల నొప్పికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో వాడుతున్న మందులు సైతం నరాల నొప్పికి కారణం అవుతుంది. కాళ్ల నరాల నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు డయాబెటిస్ కంట్రోల్లో లేకపోతే కాళ్ల నరాల నొప్పులను చూస్తారు.

సయాటికా, వెన్నెముక సమస్యలతో పాటు కొన్ని విటమిన్ లోపాలు సైతం నరాల నొప్పికి కారణమవుతాయి. శరీరంలో రక్తం గడ్డ కట్టే వారికి సైతం ఈ సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో విషాహారం తినడం కూడా ఈ సమస్యకు కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. నరాలకు సంబంధించి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి.