ఈ పనులు చేస్తే మంగు మచ్చలు, డార్క్ మార్క్స్ సులువుగా దూరం.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది ముఖంపై వచ్చే మంగు మచ్చల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆడవారిలో మెనోపాజ్ టైమ్‌ లో ఈ సమస్య రావడం సాధారణంగా జరుగుతుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖంపై మంగు మచ్చలు, నల్ల మచ్చలు రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అతినీలలోహిత కిరణాల ప్రభావం వల్ల స్కిన్ పై మచ్చలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.

మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా వచ్చినా ముఖంపై మంగు మచ్చలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఈ మచ్చలు కాళ్లు, చేతులపై వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. థైరాయిడ్, ఈస్ట్రోజన్ హార్మోన్ల సమస్య వల్ల కూడా కొన్నిసార్లు ఈ మచ్చలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. లివర్‌లో వ్యర్థాలు ఏర్పడితే కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.

ప్రతిరోజూ నిమ్మరసం తాగినా నిమ్మరసం మంగు మచ్చలు ఉన్నచోట అప్లై చేసినా ఈ సమస్య సులువుగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ములేటి పొడిలో ఆవుపాలు వేసి పేస్ట్ లా చేసి ఉదయం, సాయంత్రం ఈ పొడిని అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. టమాటల్ని జ్యూస్‌లా చేసి కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలిపి ఉప్పు, మిరియాల పొడి వేసి తాగడం ద్వారా కూడా మంగు మచ్చలు దూరమవుతాయి.

ఇంట్లోనే హోమ్ మోడ్ ప్యాక్స్ ను తయారు చేసుకుని క్రీమ్స్, ప్యాక్స్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు సొంతమయ్యే అవకాశం ఉంటుంది. హోమ్ మేడ్ ప్యాక్స్ ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ ఉండవని చెప్పవచ్చు.