బెల్లంకొండ హిట్ కాంబో.. ఈసారైనా హిట్టొచ్చేనా?

టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీనుతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తరువాత వరుస కమర్షియల్ సినిమాలతో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఎక్కువగా యాక్షన్ కథలతోనే ఈ యంగ్ హీరో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

చివరిగా హిందీలో ఛత్రపతి మూవీ రీమేక్ లో నటించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో అదే టైటిల్ తో తెరకెక్కింది. ఇక ఈ మూవీ హిందీలో ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఏకంగా 50 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో పెన్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించింది.సినిమాకి ప్రమోషన్ కూడా గట్టిగా చేశారు. తన తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ కి యుట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ఉండటంతో ఛత్రపతి సూపర్ హిట్ అయిపోతుందని అనుకున్నారు.

అయితే బెల్లంకొండ ఆశలని అడియాశలు చేస్తూ ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం మూటగట్టుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలవడం విశేషం. అయితే ఆ మూవీ దెబ్బతో కొద్ది రోజులు సైలెంట్ అయిన ఈ యంగ్ హీరో మరల తెలుగులో తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టాడు. చివరిగా అల్లుడు అదుర్స్ మూవీతో తెలుగు ప్రేక్షకులని బెల్లంకొండ శ్రీనివాస్ పలకరించాడు.

దీనికంటే ముందుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చెసుకున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మళ్ళీ అదే దర్శకుడు చెప్పిన కథకి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. రుద్రాక్ష టైటిల్ తో ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

జ్ఞాన్ వేల్ రాజా ఈ చిత్రాన్ని ఏకంగా 60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. థ్రిల్లర్ యాక్షన్ జోనర్ లో ఈ చిత్రాన్ని రమేష్ వర్మ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. యూనివర్శల్ కాన్సెప్ట్ ఎంచుకున్న మొదటిగా తెలుగు, తమిళ్ భాషలలో రిలీజ్ చేసి సక్సెస్ బట్టి మిగిలిన భాషలలో కూడా డబ్ చేయాలని అనుకుంటున్నారంట. రుద్రాక్ష అంటే శివుడికి ప్రీతిపాత్రమైంది. ఈ నేపథ్యంలో కాన్సెప్ట్ కూడా స్పిరిచ్యువల్ టచ్ తో ఉంటుందని బోగట్టా.