పేపర్ కప్ లో టీ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది పేపర్ కప్ లో టీ తాగడానికి ఇష్టపడతారు. పేపర్ కప్ లో టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువమంది భావిస్తారు. అయితే పేపర్ కప్ లో టీ తాగడం వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పేపర్ కప్ లో వేడి పానీయాలను పోసి ఎక్కువ సమయం ఉంచితే పేపర్ కప్ లో ఉండే ప్లాస్టిక్ వేడి పానీయాలలో కలిసే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది పేపర్ కప్ లలో టీ తాగుతారు.

అయితే ఎక్కువ సమయం పాటు పేపర్ కప్ లో టీ తాగేవాళ్లకు మాత్రం షాక్ తప్పదని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. పేపర్ కప్స్ లో టీ తాగడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. పేపర్ కప్స్ లో టీ తాగితే జింక్, లెడ్, క్రొమియం మన శరీరంలో చేరే అవకాశంతో పాటు ఇతర వ్యాధుల బారిన పడటానికి కారణమయ్యే అవకాశం ఉంది.

పేపర్ కప్ లో ఉండే లైనింగ్ ను ప్లాస్టిక్ తో తయారు చేయడం జరుగుతుంది. పేపర్ కప్ నుంచి వెలువడే మైక్రో ప్లాస్టిక్స్ ఒక విధంగా చెప్పాలంటే శరీరంలో విషంగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువసార్లు పేపర్ కప్ లో టీ తాగేవాళ్లు వాటిని అవైడ్ చేస్తే మంచిది. పేపర్ కప్స్ వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువసార్లు ప్రయాణం చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

అదే సమయంలో షుగర్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది.