మన శరీరం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలనే సంగతి తెలిసిందే. మన శరీరంలో రక్తం గడ్డ కట్టడం వల్ల కొన్ని తీవ్రమైన స్థాయిలో సమస్యలు తప్పవు. శరీరంలో రక్తం గడ్డ కట్టడం వల్ల వేర్వేరు ప్రమాదకర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. ధమనులు, సిరలలో రక్తం గడ్డ కడితే గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
గుండె కణాలు బలహీనంగా ఉన్న సమయంలో ధమనులలో రక్తం గడ్డ కట్టడం మొదలైతే గుండెలో కూడా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి. ధమనులలో రక్తం పేరుకుపోతే హృదయ స్పందన వేగం తగ్గుతుంది. రక్తం గడ్డ కడితే గుండె చుట్టూ తీవ్రమైన నొప్పి కలిగే అవకాశాలు ఉంటాయి. గుండె చుట్టూ రక్తం గడ్డ కట్టడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది.
ఎవరైనా వ్యక్తి గుండెలో రక్తం గడ్డ కడితే గుండె కండరాలలో రక్త ప్రసరణ ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. రక్తనాళాలకు గాయం, అధిక రక్తపోటు, గుండె పరిస్థితులు, అతిగా మద్యపానం, ధూమపానం, అధిక బరువు, గర్భం, జనన నియంత్రణ మాత్రలు, హార్మోన్ పునఃస్థాపన చికిత్స, క్యాన్సర్ సైతం రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతాయని చెప్పవచ్చు.
రక్తం గడ్డకట్టడం అనేది రక్తనాళాలకు గాయం ఏర్పడినప్పుడు, రక్తస్రావాన్ని ఆపడానికి లేదా నెమ్మది చేయడానికి ఏర్పడే గడ్డ. రక్తం గడ్డకట్టడం ప్లేట్‌లెట్స్ మరియు ఫైబ్రిన్‌తో తయారవుతుందని చెప్పవచ్చు. రక్తం గడ్డకట్టడం నిరోధించడానికి లేదా పెద్దది కాకుండా ఉండటానికి రక్తాన్ని పలుచన చేసే మందులు ఉపయోగిస్తారని చెప్పవచ్చు.