ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా.. కొత్త కార్డ్ ను ఏ విధంగా పొందాలంటే?

29_05_2022-aadhar_227546831666951873071

మనలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందలన్నా ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఉపయోగపడటంతో పాటు బ్యాంకు లావాదేవీల విషయంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆధార్ కార్డ్ ను పోగొట్టుకున్న సమయంలో ఇతరులు ఆ కార్డును దుర్వినియోగం చేస్తారని భావిస్తే ఆధార్ కార్డ్ ను లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డ్ ను లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎం ఆధార్ యాప్ సహాయంతో కూడా ఆధార్ కార్డ్ ను సులువుగా లాక్ చేసుకోవచ్చు.

కొత్త ఆధార్ కార్డ్ కావాలని భావించే వాళ్లు ఆధార్ కార్డ్ సెంటర్ల ద్వారా కొత్త కార్డును పొందే అవకాశం ఉంది. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ కు మొబైల్ నంబర్ రిజిష్టర్ అయ్యి ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుర్తింపు కార్డుగా వాడవచ్చు.

ఆధార్ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డ్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లో ఏవైనా వివరాలను మార్చుకోవాలని భావిస్తే సమీపంలోని ఆధార్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా ఈ వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.