పది అర్హతతో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు.. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలంటే?

అంగన్ వాడీ ఉద్యోగం సాధించడం అంటే సులువైన విషయం కాదు. అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వేర్వేరు సందర్భాల్లో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉంటాయి. సాధారణంగా పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నపిల్లలకు చదువు చెప్పడంతో వాళ్లకు సరైన సమయంలో టీకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

గ్రామ, మండలాల జనాభా ఆధారంగా అంగన్ వాడీ సెంటర్లకు పిల్లలను కేటాయించే అవకాశాలు అయితే ఉంటాయి. అనంతపురం జిల్లాలో 84 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఐసీడీఎస్ అధికారుల నుంచి ఈ మేరకు వివరాలు వెల్లడి కావడం గమనార్హం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

అక్టోబర్ నెల 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతో బెనిఫిట్ కలుగుతుంది.

అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల కోసం ఆసక్తి ఉన్నవాళ్లు ఈ జాబ్స్ నోటిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.