నోటిపూతకు వేగంగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే.. ఇవి పాటిస్తే చాలంటూ?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధించే ఆరోగ్య సమస్యలలో నోటిపూత ఒకటి. విటమిన్ లోపం వల్ల చాలామంది నోటిపూత సమస్యతో బాధ పడుతున్నారు. జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్ లోపం వల్ల నోటిపూత బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. తేనె నోటిపూతకు చక్కని ఔషధం అని చెప్పవచ్చు. తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటిపూతకు వేగంగా చెక్ పెడతాయి.

తేనెలో పసుపు వేసుకుని నోటిపూత ఉన్న భాగంలో పెట్టుకుంటే మంచిది. యాలకులు, లవంగం నమలడం ద్వారా నోటిపూత దూరమవుతుంది. నోటిపూత ఉన్నచోట కొబ్బరినూనెను రాయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉండగా తులసి ఆకులను నీటితో పాటు నమిలితే మంచిది. నోటి పూత ఉన్న చోట నెయ్యి రాయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

నోటిపూత వచ్చిన వారు ఎక్కువగా మంచినీళ్లు తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు. వేడి చేసే వస్తువులకు వీలైనంత దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి వల్ల కూడా నోటిపూత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్ని చిట్కాలు పాటించినా నోటిపూత తగ్గకపోతే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గితే కూడా నోటిపూత సమస్య వస్తుంది.

మనం తీసుకునే ఆహారం శరీరానికి పడకపోవడం వల్ల కూడా నోటిపూత బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఆమ్ల గుణాలు ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. నోటిపూత సమస్యతో బాధపడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.