ఎస్బిఐ కస్టమర్లకు షాక్… ఆ వడ్డీ రేట్ల పై భారీ పెంపు…?

sbi-agencies

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. ఎస్బిఐ అందిస్తున్న సేవల ద్వారా వినియోగదారులు ఎంతో లాభ పొందుతున్నారు. వినియోగదారుల అవసరానికి అనుగుణంగా ఎస్బిఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఎప్పుడు తన వినియోగదారులకు శుభవార్త చెప్పే ఎస్బిఐ ఈసారి వారికి పెద్ద షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఎస్బిఐ లోన్ తీసుకునే వారికి ఇది బాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎస్బిఐ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అలాగే ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం మేరకు పెంచింది.

అదే విధంగా వివిధ కాలపరిమితి డిపాజిట్‌ రేట్లను కూడా 0.05 శాతం నుంచి 0.25 శాతం వరకు పెంచింది. కనీస వడ్డీరేటు 7.95 శాతం వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెంపు వల్ల హోమ్‌, ఆటో రుణాల కస్టమర్లకు ఏ మాత్రం భారం ఉండదని తెలిపింది

ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది.. దీనిద్వారా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు..ఇప్పుడు పెరిగిన వడ్డీ రేట్ల వివరాలలోకి వెళితే … 1-3 నెలలు 8.10 శాతం, 6 నెలలు 8.40 శాతం, ఏడాది 8.50 శాతం, రెండేళ్లు 8.60 శాతం, మూడేళ్లు 8.70 శాతం పెంచింది.

అలాగే డిపాజిట్ లపై వడ్డీ రేట్లు..రూ.10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై కనీస సేవింగ్స్‌ బ్యాంక్‌ వడ్డీ రేటు 2.70 శాతం ఉండగా, రూ,10 కోట్ల కన్నా పైబడితే 3 శాతం, రూ.2 కోట్లు లోపు డిపాజిట్లకు టైం పిరియడ్ వడ్డీ రేట్లను ఒకసారి తెలుసుకుందాం..

1-2 సంవత్సరాలు 6.80 శాతం

2-3 సంవత్సరాలు 7 శాతం

3 సంవత్సరాలు పైన 6.50 శాతం

రూ.2 కోట్లు పైబడినబల్క్‌ డిపాజిట్‌ రేట్లకు వడ్డీ రేటును 0.25 శాతం నుంచి 0.50 శాతం మేరకు పెంచింది. ఇక వివిధ కాల పరిమితుల ఆధారంగా ఈ రేటు 4.75 శాతం నుంచి 6 శాతం మధ్యన ఉంటుందని బ్యాంకు తెలిపింది.