ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా నిలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ఎప్పటికప్పుడు తన వినియోగదారుల అవసరాల దృశ్య అనేక కొత్త కొత్త స్కీములను అమలులోకి తీసుకువస్తోంది. ఇలా ఎప్పుడు కొత్త కొత్త స్కీముల ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తున్న ఎస్బిఐ ఇటీవల కస్టమర్లకు ఒక షాక్ ఇచ్చింది. ప్రస్తుత కాలంలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ మంజూరు చేస్తోంది. అత్యవసర సమయంలో ఈ కార్డు తో షాపింగ్‌లు చేయడంతో పాటు రెంట్ పేమెంట్స్, ఇతర బిల్లులు కట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ఉపయోగించిన తర్వాత నెలవారి బిల్లులు తప్పక చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి నెల విధించిన గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించినట్లయితే తక్కువ వడ్డీ పడుతుంది. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించటం ఆలస్యం చేయటం వల్ల రోజు రోజుకి అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, ఫీజులను సవరించింది. కొత్త ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు 17 మార్చి 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు రూ.99 నుంచి రూ.199 కు పెంచినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతే కాకుండా ట్యాక్సులు అదనంగా ఉంటాయని తెలిపింది.
ఇక పెంచిన క్రెడిట్ కార్డు చార్జీలపై అవగాహన కల్పించేలా ఎస్‌బీఐ కస్టమర్లకు మెయిల్స్ పంపింది.
ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ హోల్డర్ల కోసం జనవరి 2023 నుంచి కొన్ని నియమాలను సవరించారు. వోచర్, రివార్డ్ పాయింట్ల రిడీమ్‌కు సంబంధించి రెండు నియమాలు ఉంటాయి. సింప్లి క్లిక్ క్లియర్‌ట్రిప్ వోచర్ ఒకే లావాదేవీలో మాత్రమే రీడీమ్ చేయాలని సవరించింది. అయితే ఈ ఆఫర్ మరే ఇతర ఆఫర్/వోచర్‌తో కలిపి ఉండకూడదని కంపెనీ వెబ్‌సైట్‌లో తెలిపింది. అలాగే అమెజాన్ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే చెల్లింపులకు సంబంధించి ఇచ్చే రివార్డు పాయింట్లను 10 X నుంచి 5Xకు సవరించింది. అయితే అపోలో 24X7, నెట్ మెడ్స్, క్లియర్ ట్రిప్ వంటి సైట్ల ద్వారా అందించే పాయింట్లను మాత్రం యథాతధంగా అమలు చేస్తున్నట్లు ఎస్బిఐ వివరించింది.