చిరంజీవి సినిమా రీమేక్.. అదీ ఓటీటీ కోసం

Remake in cards for Chiranjeevi's hit movie

Remake in cards for Chiranjeevi's hit movie

మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాల్లో కొన్ని నవలలు ఆధారంగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పలు నవలలను చిరంజీవితో సినిమాలుగా చేశారు అనేకమంది దర్శకులు. వాటిలో చాలా సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఆ హిట్ సినిమాల్లో ‘దొంగ మొగుడు’ కూడ ఒకటి. 1987లో వచ్చిన ఈ సినిమాను కోదండరామిరెడ్డి తెరకెక్కించడం జరిగింది. యండమూరి రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు.

అప్పట్లో సినిమా కోసం నవలలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ‘నల్లంచు తెల్లచీర’ నవలను సినిమాగా తీయాలని భావిస్తున్నారట యండమూరి. ఈ తరానికి తగ్గట్టు కథను మార్చుకుని చేయనున్నారట. దీనికి దర్శకత్వం యండమూరి వీరేంద్రనాథ్ వహిస్తారట. అంటే ‘దొంగ మొగుడు’కు ఇదొక రీమేక్ లాంటిదని అనుకోవచ్చు. దీన్ని ఓటీటీలో విడుదల చేయడానికి చేస్తున్నారట. ప్రస్తుతం అయితే చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే సినిమా మీద ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.