నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడితో కలిసి ఒక సినిమా చేస్తారని గతంలో బలమైన వార్తలే వినబడ్డాయి. రేపో మాపో ఇద్దరి నడుమా చర్చలు మొదలవుతాయని ప్రచారం జరిగింది. కానీ అవేమీ జరగలేదు. ఇద్దరూ కలిసింది లేదు చర్చించింది లేదు. ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. బాలయ్య బోయపాటితో కమిట్ అవ్వగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమాతో బిజీ అయ్యారు. అయితే మళ్ళీ వీరి ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చింది.
‘ఎఫ్ 3’ కంప్లీట్ కాగానే అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రావిపూడి ఖాళీ అయ్యారు. ఆల్రెడీ స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి తర్వాతి సినిమా కూడ పెద్ద హీరోతోనే చేయాలనుకుని మొదట అనుకున్నట్టు బాలయ్యకు టచ్లోకి వెళ్లారట. ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడిచాయని, కథ లాక్ అయిందని ఫిలిం నగర్ టాక్. బాలయ్య కూడ రావిపూడితో వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారట. ‘అఖండ’ తర్వాత వీరి సినిమా ఉండవచ్చని అంటున్నారు.