భారీ వేతనంతో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు మదనపల్లె మెడికల్ కాలేజీ తీపికబురు అందించింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తం 54 ఉద్యోగ ఖాళీలను వేర్వేరు విభాగాలలో భర్తీ చేయనున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో 6, డెంటిస్ట్ విభాగంలో 1, అనస్తియాలజీ విభాగంలో 2, రేడియో డయాంగ్ మనీ విభాగంలో 2, ఓబిసి విభాగంలో 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇఎన్టి విభాగంలో 1, ఆర్థోపెడిక్ విభాగంలో 2, జనరల్ సర్జరీ విభాగంలో 2, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగంలో 1, పీడియాట్రిక్ విభాగంలో 1, జనరల్ మెడిసిన్ విభాగంలో 3, కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో 3, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో 3, మైక్రోబయాలజీ విభాగంలో 4, ఫార్మాకాలజీ విభాగంలో 4, బయో కెమిస్ట్రీ విభాగంలో 4, ఫిజియాలజీ విభాగంలో 3, అనాటమీ విభాగంలో 5 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు మూడు సంవత్సరాల పాటు ఎండీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 70,000 రూపాయల వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరునుంది.

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉద్యోగ ఖాళీలకు ఒకింత పోటీ ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు మేలు జరగనుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.