ఒక్క పాలసీతో కుటుంబం మొత్తానికి భద్రత.. అదిరిపోయే సూపర్ ఎల్ఐసి పాలసీ!

ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త స్కీం అందుబాటులోకి తీసుకువస్తూ ఉంది. ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మనం స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసే డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. అలాగే కొన్ని పథకాలకు అత్యధికంగా వడ్డీరేట్లను పెంచడం వల్ల ఎంతో లాభం పొందవచ్చు. పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వస్తుండటంతో చాలా మంది ఇందులోని వివిధ పథకాలను ఎంచుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎల్ఐసి తాజాగా అత్యంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని అందించే పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ పథకం వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..ఇందులో మీ కుటుంబం పెట్టుబడి పెట్టడం ద్వారా పొదుపు, భద్రత రెండింటికీ హామీని పొందుతారు. ఈ పాలసీ బీమా జ్యోతి ప్లాన్. ఈ పథకం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం..

పెట్టుబడి పెట్టే వ్యక్తులు రూ.1,000పై ప్రతి సంవత్సరం రూ.50 భారీ రాబడిని పొందవచ్చు అయితే పాలసీదారుడు కనుక మరణిస్తే అటువంటి పరిస్థితిలో, అతని కుటుంబం మరణ ప్రయోజనం పొందుతుంది..15 నుంచి 20 ఏళ్ల కాలానికి ఈ పాలసీలో పెట్టుబడి పెడుతున్నారు.పాలసీలో, మీరు మొదటి 5 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఈ పాలసీలో చేరడానికి మీ వయసు మీ వయస్సు 90 రోజుల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. పాలసీలో నెలకు కనీసం రూ.5,000, వార్షిక ప్రాతిపదికన రూ.50,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి మీరు సంస్థ బ్రాంచ్ కు వెళ్ళాలి.ఆన్లైన్లో కూడా పాలసీ పెట్టుబడి పెట్టవచ్చు..