పది అర్హతతో రైల్వేలో 772 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 772 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలలో నాగ్‌పూర్ డివిజన్ కోసం 708 ఉద్యోగ ఖాళీలు ఉండగా వర్క్‌షాప్ మోతీ బాగ్ నాగ్‌పూర్ కోసం 64 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఇతర ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నరని సమాచారం అందుతోంది.

24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. secr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. హోమ్‌పేజీలో “రిక్రూట్‌మెంట్” లేదా “కెరీర్” విభాగాన్ని ఎంచుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. వ్యక్తిగత సమాచారం, అనుభవం, విద్యార్హతలను పూరించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితాపై దరఖాస్తుదారుల ఎంపిక ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. సమాచారాన్ని క్రాస్-చెక్ చేసి ఫారమ్ ను పూర్తి చేస్తే మంచిదని చెప్పవచ్చు.

పదో తరగతి, ఐటీఐ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం సైతం భారీ స్థాయిలోనే ఉండనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.