సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1425 పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. secl-sil.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరి నెల 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలలొ టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 1075 ఉండగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 350 ఉన్నాయి. బీటెక్ పాసైన ఐదు సంవత్సరాల లోపు వ్యక్తులు మాత్రమే గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. మార్చి నెల 15 నుంచి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.
సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పని చేయడం ఎంతో మంది అభ్యర్థుల కల కాగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగాలకు కాంపీటీషన్ ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.
నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎన్నో సందేహాలకు చెక్ పెట్టడం అవకాశం అయితే ఉంటుంది. కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో జాబ్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేయడం గమనార్హం.