నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు ఇదే.. ఇలా చేస్తే రూ.9000 స్టైఫండ్ పొందే ఛాన్స్!

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నా పూర్తిస్థాయిలో ఉద్యోగాలను కల్పించడం సాధ్యం కావడం లేదు. అయితే ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఐటీఐ అర్హతతో అప్రెంటీస్ మేళా నిర్వహించడానికి ఈ సంస్థ పూర్తిస్థాయిలో సిద్ధం కావడం గమనార్హం.

ఈ నెల 10వ తేదీన అప్రెంటీస్ షిప్ నిర్వహించనుండగా అర్హత ఉండి 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తుండగా ఈ ఉద్యోగ ఖాళీలలో మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 10, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 50 ఉన్నాయి. ఈ శిక్షణకు ఎంపికైన వాళ్లకు 9,000 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో ఈ జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో కూడా ఐటీఐ పాసైన వాళ్లకు బెనిఫిట్ కలిగే విధంగా ఎన్నో జాబ్ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఐటీఐ అర్హత వల్ల నిరుద్యోగులు ఊహించని స్థాయిలో బెనిఫిట్ పొందుతున్నారు.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు అయినా ఈ జాబ్ మేళాకు హాజరైతే మంచిదని చెప్పవచ్చు. అయితే తక్కువ మొత్తం వేతనం లభిస్తుండటంతో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ములుగు రోడ్డు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బాలుర ఐటిఐలో అర్హత ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.