హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

హెవీ వెహికల్ ఫ్యాక్టరీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ప్రముఖ సంస్థ సిద్ధమైంది. https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2023 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 320 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ ఉద్యోగ ఖాళీలలో 110 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, 110 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, 100 నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కేటగిరీలో బీటెక్ మెకానికల్ చదివిన అభ్యర్థులకు 50 ఉద్యోగ ఖాళీలు ఉండగా సీ.ఎస్.ఈ అభ్యర్థులకు 19, ఈఈఈ అభ్యర్థులకు 16 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివిన వాళ్లకు 15 పోస్టులు ఉండగా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్లకు 10 ఉద్యోగాలు ఉన్నాయి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ లో మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు 50, ఈఈఈ అభ్యర్థులకు 30, సీ.ఎస్.ఈ అభ్యర్థులకు 7, సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు 5, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు 18 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 8,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. http://boat-srp.com/wp-content/uploads/2023/11/hvf_notification_phase_ii.pdf నోటిఫికేషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.