ఎస్బీఐ సూపర్ స్కీమ్.. రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.21 లక్షలు పొందే ఛాన్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా అమలు చేస్తున్న స్కీమ్స్ కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎస్బీఐ కొత్త స్కీమ్స్ ను అమలులోకి తెస్తుండటం గమనార్హం. సీనియర్ సిటిజన్లు ఎస్బీఐలో పదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 10 లక్షల రూపాయలకు ఏకంగా 21 లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.5 శాతం వడ్డీ రేటు అమలవుతుండగా పెట్టుబడికి రెట్టింపు మొత్తాన్ని ఈ స్కీమ్ అందిస్తుండటంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు కాగా ఇందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మెచ్యూరిటీ రాబడి ఆధారంగా స్లాబ్ రేటు ప్రకారం ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. దీర్ఘకాలంలో ఆదాయం కోరుకునే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. సాధారణ కస్టమర్లతో పోల్చి చూస్తే సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్స్ ద్వారా మరింత బెనిఫిట్ కలుగుతుంది.

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఎస్బీఐ కస్టమర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.