దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం కొత్త పథకాలను అమలు చేస్తుండగా ఈ పథకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఒకేసారి బ్యాంకులో ఎక్కువ మొత్తం డబ్బులు డిపాజిట్ చేసి ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.
ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల పదేళ్ల పాటు ఏకంగా నెలకు రూ.11 వేలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ టెన్యూర్ ను ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎంచుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి. కనీసం రూ.1000 నుంచి ఎక్కువ మొత్తం కూడా ఈ స్కీమ్ ద్వారా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా పొందే రాబడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 75 శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.11,870 పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు సెక్షన్ 80 టీటీబీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు 6.5 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎంచుకున్న మెచ్యూరిటీ టెన్యూర్ వరకు డబ్బులు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఉంటుందని చెప్పవచ్చు.