దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 94 రిసాల్వర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. sbi.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ నెల 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది.
నవంబర్ నెల 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఎస్బీఐ స్వీకరిస్తుండగా అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి గతంలో ఎస్బీఐలో పని చేసి ఉంటే విద్యార్హతతో సంబంధం లేకుండా ఈ ఉద్యోగంలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎస్బీఐలో పని చేసిన మాజీ అధికారులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇంటర్వ్యూ రౌండ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా కనీస అర్హత మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.
మెరిట్ జాబితా ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎలాంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు చేకూరనుంది.