Mahesh Babu: మహేష్ చేసిన ఆ ఒక్క తప్పు కెరియర్ ను10 సంవత్సరాలు వెనక్కి నెట్టిందా?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలనటుడుగా అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు మహేష్ బాబు. చిన్నతనంలోని తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన అనంతరం రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక హీరోగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈయన రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ ఆయన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇటీవల కాలంలో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ మహేష్ బాబు దూసుకుపోతున్నారు అయితే గతంలో ఈయన చేసిన తప్పులే అందుకు కారణమని చెప్పాలి.

ఇక బ్రహ్మోత్సవం సినిమా ముందు వరకు కూడా మహేష్ బాబు పూర్తిస్థాయిలో కథ వినకుండా కేవలం స్టోరీ లైన్ విని సినిమాకు కమిట్ అయ్యేవారట అయితే బ్రహ్మోత్సవం విషయంలో కూడా ఇలాగే జరిగింది. దీంతో ఈ సినిమా డిజాస్టర్ కావడమే కాకుండా కెరియర్ పరంగా తనని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టడంతో మహేష్ బాబు అప్పటినుంచి పూర్తి స్థాయిలో కథ విన్న తర్వాతనే సినిమాలకు కమిట్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.