ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ.47 వేల వేతనంతో?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుస జాబ్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌ల కోసం రిక్రూట్ మెంట్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎస్బీఐ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

మొత్తం 8773 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదిగా ఉండనుంది. రెగ్యులర్, బ్యాక్ ల్యాగ్ పోస్టులతో కలిపి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 600 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ప్రిలిమినరి, మెయిన్ ఆన్ లైన్ ఎగ్జామ్ తో పాటు స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19,900 రూపాయల నుంచి వేతనం మొదలవుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఆరు నెలల పాటు ప్రొబేషన్ ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు కాగా మిగిలిన అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 47 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది.