కస్టమర్లకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఎస్బిఐ..?

దేశీయ బ్యాటింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ని అమలులోకి తీసుకువచ్చి తమ కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పటికే కస్టమర్లు అవసరాలకు అనుగుణంగా ఎన్నో స్కీమ్స్ ని అమలులోకి తీసుకు వచ్చిన ఎస్బిఐ తాజాగా తన కస్టమర్లకు మరొక శుభవార్త తెలియజేసింది. ఈ కొత్త స్కీం ద్వారా కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)
యూపీఐ అండ్ పే నౌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్బిఐ కస్టమర్లు భీమ్ ఎస్‌బీఐ పే యాప్ ద్వారా ఈ సరికొత్త సేవలు పొందవచ్చు.

అయితే తాజాగా క్రాస్ బార్డర్ యూపీఐ సేవలను తాజాగా కేంద్రం తీసుకు వచ్చింది. ఈ యూపీఐ సేవల ద్వారా విదేశాలలో ఉన్న వారికి చాలా సులభంగా యూపీఐ ద్వారా డబ్బులు పంపొచ్చు, పొందవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ కూడా ఈ సేవలను తన కస్టమర్లకు తీసుకు రావడం జరిగింది. భీమ్ ఎస్‌బీఐ పే యాప్ ద్వారా కస్టమర్లు విదేశాలలో ఉన్న వారికి యూపీఐ ద్వారా డబ్బులు సెండ్ చెయ్యచ్చు…అలానే పొందొచ్చు కూడా. ఇన్‌వర్డ్ , ఔట్‌వర్డ్ రెమిటెన్స్ సర్వీసులు కూడా ఇప్పుడు పొందొచ్చు. అయితే సింగపూర్‌ ఇండియా దేశాల మధ్యనే ఇవి అందుబాటులో వున్నాయి.

గతంలో భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళిన వారు అక్కడ మన దేశకరెన్సీని విదేశీ కరెన్సీ తో మార్చుకొని ఉపయోగించడానికి ఎన్నో అవస్థలు పడేవారు. అయితే ప్రస్తుతం ఎస్బిఐ అందిస్తున్న ఈ భీమ్ ఎస్‌బీఐ పే యాప్ ద్వారా చాలా సులభంగా చెల్లింపులు జరిపోవచ్చు. ఎస్బిఐ కస్టమర్స్ క్యూఆర్ కోడ్ లేదా బ్యాంక్ అకౌంట్‌ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు చెప్పవచ్చు. ఎస్బిఐ అమలులోకి తీసుకువచ్చిన ఈ భీమ్ యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఇదిలా ఉంటే ఇతర బ్యాంకులతోపాటు ఎస్బిఐ కూడా రుణాల రేట్లు భారీగా పెంచేసింది. అలాగే ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు కూడా పెంచింది.