రూ.3,250 పొదుపు చేస్తే సులువుగా రూ.కోటి పొందే ఛాన్స్.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది కోటీశ్వరులు కావాలని భావిస్తారు. అయితే కోటీశ్వరులు కావాలనే కలను నెరవేర్చుకోవడం సులువు కాదనే సంగతి తెలిసిందే. ఎవరైతే క్రమశిక్షణతో పొదుపు చేస్తారో వాళ్లు మాత్రమే కోటి రూపాయలు పొందే అవకాశం కనిపిస్తుంది. మన జీతంలో 20 నుంచి 30 శాతం పొదుపు చేస్తే దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎంత ఎక్కువ మొత్తంలో పొదుపు చేస్తే అంత ఎక్కువ రాబడిని పొందవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు 3250 రూపాయలు పొదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో కోటి రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 12 నుంచి 24 శాతం వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వయస్సును బట్టి పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు సొంతమవుతాయి. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నెలకు 3,250 రూపాయల చొప్పున 60 ఏళ్ల వరకు జమ చేస్తే కోటి రూపాయలు సొంతమవుతాయి.

ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన లేని వాళ్లు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ స్కీమ్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.