నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు!

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఈ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కాగా బీఈ, బీటెక్, ఇతర కోర్సులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు బెనిఫిట్ కలిగేలా ఈ సంస్థ నుంచి ప్రకటన వెలువడింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం ఈ సంస్థ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం గమనార్హం. జులై 5 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

జులై నెల 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. sailcareers.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా మెటలర్జీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. బీటెక్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్ అభ్యర్థులు 65 శాతం మార్కులు సాధించి ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 55 శాతం మార్కులు సాధించిన మిగతా అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. గేట్ 2024 స్కోర్ కలిగి ఉండి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

1996 జులై 25 కంటే ముందుగా జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాదు. 249 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జనరల్ అభ్యర్థులకు 700 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.