సెయిల్ లో భారీ వేతనంతో ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో?

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. అన్‌రిజర్వుడ్‌కు 35, ఎస్టీలకు 22, ఎస్సీలకు 10, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 8 కేటాయించగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

పదో తరగతి పాసై అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థుల ఎత్తు 143 సెం.మీ. ఉండి, బరువు 35 కేజీలు కచ్చితంగా ఉండాలి. దృష్టి లోపాలు లేని అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులను స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపిక చేయడం జరుగుతుంది. వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే.

రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. శిక్షణ సమయంలో నెలకు రూ.12,900 లభించనుండగా శిక్షణ పూర్తైన తర్వాత నెలకు 35,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. http://www.sailcareers.com/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.