స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 64 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పని చేయాలనుకునే అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా స్ట్రెంత్ & కండిషనింగ్ ఎక్స్‌పర్ట్ ఉద్యోగ ఖాళీలు 28 ఉన్నాయి.
ఫిజియాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా బయోమెకానిక్స్ ఉద్యోగ ఖాళీలు 10, సైకియాట్రిస్ట్ ఉద్యోగ ఖాళీలు 4, న్యూట్రిషనిస్ట్ 1, బయోకెమిస్ట్ 1 ఉన్నాయి. ఆయా విభాగాలలో డిగ్రీలతో పాటు ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయలకు అటూఇటుగా వేతనం లభిస్తుంది.
గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండటంతో నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు చేకూరనుంది. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.
అక్టోబర్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు భారీ వేతనం లభిస్తుండటంతో పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.