ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వైఎస్సార్ రైతుభరోసా పేరుతో అమలైన ఈ స్కీమ్ ఇప్పుడు మాత్రం అన్నదాత సుఖీభవ పేరుతో అమలు కానుంది. ఈ స్కీమ్ ద్వారా ఏటా 20 వేల రూపాయలు రైతులకు అందనున్నాయి. త్వరలో పూర్తిస్థాయి విధివిధానాలు జారీ కానున్నాయని తెలుస్తోంది.
ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ.14 వేలు, కేంద్రం పీఎం కిసాన్ ద్వారా 6 వేల రూపాయలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ విధంగా రాష్ట్రంలోని రైతులు 20 వేల రూపాయలు పొందనున్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల స్కీమ్ ను వడ్డీలేని రుణాలు పేరుతో అమలు చేయనున్నారని వైఎస్సార్ ఉచిత పంటల బీమా స్కీమ్ ను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో అమలు చేయనున్నారని తెలుస్తోంది
చంద్రబాబు రైతులకు మేలు చేసేలా వేర్వేరు స్కీమ్స్ అమలు దిశగా అడుగులు వేయడంపై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులకు పెట్టుబడి సహాయంగా ఈ మొత్తం ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులకు మేలు చేసే దిశగా టీడీపీ నిర్ణయాలను ప్రకటిస్తోంది.
అయితే రాష్ట్రంలో ఈ పథకం ఎప్పటినుంచి అమలవుతుందనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. ఈ పథకాన్ని వీలైనంత వేగంగా అమలు చేస్తే తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ రైతుల కోసం అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్స్ లో ఒకటని చెప్పవచ్చు.