రైల్వే శాఖ ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ ను రైల్వే శాఖ విడుదల చేస్తోంది. 3093 అప్రెంటిస్ పోస్టులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. డిసెంబర్ 11న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా జనవరి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నార్త్ రైల్వేలోని విభాగాలు, యూనిట్లు, వర్క్ షాప్‌ల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ ఉండగా ఈ ట్రైనింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ చేయడం ద్వారా వర్క్‌పై పూర్తిస్థాయి అవగాహన వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. https://rrcnr.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కులు, ఐటీఐ పరీక్షలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా అర్హత ఉన్నవాళ్లను ఎంపిక చేసి 2024 ఫిబ్రవరి 11న ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.