ఇంటర్, డిగ్రీ అర్హతలతో భారీ స్థాయిలో రైల్వే ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

మనలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. భారతీయ రైల్వేలలో మరో భారీ జాబ్ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడుగుతున్నాయి. మొత్తం 11558 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగ ఖాళీలు 8113 ఉండగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగ ఖాళీలు 3445 ఉండటం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలకు సెప్టెంబర్ నెల 14వ తేదీన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా 2024 సంవత్సరం అక్టోబర్ 13 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు మాత్రం 21 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీసం డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. గ్రాడ్యుయేట్ పోస్టుల్లో, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా ఉద్యోగ ఖాళీల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 1, ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 2 ను నిర్వహించడం జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత సాధిస్తారో వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది.