నిరుద్యోగులకు తీపికబురు.. రైల్వే శాఖలో ఏకంగా 5696 అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూరే విధంగా అదిరిపోయే తీపికబురును అందించింది. 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జనవరి నెల 20వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.

indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫిబ్రవరి నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పదో తరగతి, ఐటీఐ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

డిప్లొమాతో పాటు బీటెక్ అర్హత కలిగి ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు కాగా కొంతమంది అభ్యర్థులకు మాత్రం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.