రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో?

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. పదో తరగతితో పాటు ఐటీఐ అర్హత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 39 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. అటెండెంట్‌ గ్రేడ్ 1లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్‌ పోస్టులు 10 ఉండగా డీజిల్ మెకానిక్‌ పోస్టులు 3, మెకానిక్‌ హెవీ వెహికల్‌ రిపేర్స్‌-మెయింటెయినెన్స్‌ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. అటెండెంట్‌ గ్రేడ్1 ఎలక్ట్రికల్ కు సంబంధించి 15 ఎలక్ట్రిషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అటెండెంట్‌ గ్రేడ్1 కు సంబంధించి ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 4 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

ఫిబ్రవరి నెల 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. rfcl.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 52 వేల రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరుగుతోంది.