రాతపరీక్ష లేకుండా రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ.. మంచి వేతనంతో?

అస్సాం రాష్ట్రం గువాహటిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డివిజన్, వర్క్ షాప్ లలో అప్రెంటీస్ శిక్షణ కొరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

డిసెంబర్ నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 5647 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనుండటం గమనార్హం. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ ఎస్ & టి, పర్సనల్స్, అకౌంట్స్, మెడికల్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. పది అర్హతతో పాటు సంబంధిత ట్రెడ్ లో ఐటీఐ, ఇంటర్, ఎల్.ఎం.టీ పాసైన వాళ్లు ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. పదో తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు రుసుము 100 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపులు ఉంటాయి. 2024 సంవత్సరం నవంబర్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 2024 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.