రైల్వే శాఖలో భారీ సంఖ్యలో 9144 టెక్నీషియన్‌ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 9,144 టెక్నీషియన్‌ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. వేర్వేరు రీజియన్లలో వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులను టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 21 ఆర్.ఆర్.బీ రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

https://indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. టెక్నీషియన్ గ్రేడ్1 ఉద్యోగ ఖాళీలకు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.

టెక్నీషియన్ గ్రేడ్ iii ఉద్యోగ ఖాళీలకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది.

రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ iii ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19900 రూపాయలు వేతనంగా లభించనుండగా టెక్నీషియన్ గ్రేడ్ i ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎంపికైన వాళ్లకు 29,200 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.