భారతీయ రైల్వే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లక్ నెలకు 1,40,000 రూపాయలు వేతనం లభించనుంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలు నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ ఉద్యోగాలు కావడం గమనార్హం.
మొదట తక్కువ సమయానికే ఈ ఉద్యోగులను నియమిస్తారని ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత గడువును పొడిగిస్తారని బోగట్టా. రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
బీఈ లేదా బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రభుత్వ సంస్థలో, అటానమస్ సంస్థల్లో స్టాట్యుటరీ సంస్థల్లో పని చేస్తున్న వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,42,400 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ కాగా నోటిఫికేషన్ విడుదలైన రెండు నెలల్లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.