పరీక్ష లేకుండానే రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. పది, ఐటీఐ అర్హతలతో?

బనారస్ లోకోమోటివ్ వర్క్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పది, ఐటీఐ సర్టిఫికెట్ అర్హతలతో రైల్వేలో ఉద్యోగం పొందాలని భావించే వాళ్లకు ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి. blw.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 374 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

నవంబర్ 25వ తేదీలోపు లేదా అంతకంటే ముందు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను మాత్రం నవంబర్ నెల 27వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఐటీఐ సీట్లు 300 ఉండగా నాన్ ఐటీఐ సీట్లు 74 ఉన్నాయి. పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పరీక్ష ఉన్న సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండటంతో పాటు సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నాన్ ఐటీఐ అభ్యర్థులు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఐటీఐ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

డెబిట్/క్రెడిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రతి యూనిట్‌లోని మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.