నవోదయ అడ్మిషన్ల దరఖాస్తు గడువులో మార్పు.. చివరి తేదీ ఎప్పుడంటే?

మన దేశంలో ఏకంగా 650 జవహర్ నవోదయా విద్యాలయాలు ఉన్నాయి. తొమ్మిదో తరగతి, 11వ తరగతి కోసం ఖాళీల సీట్ల భర్తీ జరుగుతుండగా ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తు గడువును పెంచినట్టు వెల్లడించింది. అర్హత ఉన్న అభ్యర్థులు జే.ఎన్.వీ లేటరల్ ఎంట్రీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

నవంబర్ నెల 9వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఏపీలో 15, తెలంగాణలో 9 జే.ఎన్.వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. బాల బాలికలకు వేర్వేరు ఆవాస సౌకర్యాలతో పాటు వసతి సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. జే.ఎన్.వీ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తేదీన ఇందుకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. అర్హత ఉన్నవాళ్లకు ఎంతగానో బెనిఫిట్ కల్గుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నవోదయ స్కూల్స్ లో చదవడం వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. నవోదయ విద్యాలయాలలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దిశగా అడుగులు పడుతుండటంపై విద్యార్థుల తల్లీదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.