నెలకు రూ.60,000 వేతనంతో 93 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

కేంద్ర ప్రభుత్వంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అడ్మినిస్ట్రేషన్ డివిజన్‌ లోని డెవలప్‌మెంట్ కమిషనర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 93 ఉద్యోగ ఖాళీలు ఉండగా యంగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

కాంట్రాక్ట్ పద్ధతిలో 2 ఏళ్ల కాలానికి యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించుకోనున్నారని సమాచారం అందుతోంది. hqrs@dcmsme.gov.in ఈమెయిల్ కు రెజ్యూమ్ ను పంపడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. హ్యుమానిటీస్ సబ్జెక్ట్/ఫీల్జ్ సబ్జెక్ట్ లేదా, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ గేదరింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 60 వేల రూపాయల వేతనం లభిస్తుంది. పనితీరు మరీ దారుణంగా ఉంటే ఉద్యోగం నుంచి తొలగించే ఛాన్స్ ఉంటుంది.

అభ్యర్థి ఏదైనా కారణం వల్ల ఉద్యోగానికి రిజైన్ చేయాలని అనుకుంటే నెల రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులు ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. కాంట్రాక్ట్ పద్దతిలో జాబ్ కావాలని కోరుకునే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టవచ్చు.