రైల్వే శాఖలో ఏకంగా 7,951 ఉద్యోగ ఖాళీలు ఉండగా రైల్వే శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రైల్వే శాఖ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సివిల్ డిప్లొమా చదువుతున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 18 నుంచి 36 ఏళ్లుగా ఉందని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35000 రూపాయల నుంచి 44900 రూపాయల వరకు వేతనం లభించనుందని భోగట్టా. (https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2024/07/cen-03-2024_je_english.pdf) వెబ్ సైట్ లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన వివరాలను నమోదుచేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే 250 రూపాయల ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి.