రైల్వే శాఖలో ఏకంగా 3115 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

ఈస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. మొత్తం 3115 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పదో తరగతి, ఐటీఐ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

2024 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. రైల్వే శాఖలో ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై ఫోకస్ పెడితే మంచిదని చెప్పవచ్చు. రైల్వే శాఖలో జాబ్ సాధిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మాత్రం లైఫ్ సెటిల్ అయినట్లేనని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

అదే సమయంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రైల్వే శాఖ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.