ప్రభుత్వ పథకాల గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే ఆ స్కీమ్స్ ద్వారా పొందే బెనిఫిట్స్ అంతాఇంతా కాదు. ఈ స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి కాగా దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కళ్లు చెదిరే రేంజ్ లో వడ్డీని పొందవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ లో ఈ అకౌంట్ ను సులువుగా ఓపెన్ చేయవచ్చు. కనీసం 500 రూపాయల నుంచి లక్షన్నర వరకు డిపాజిట్ చేయవచ్చు.
అకౌంట్ లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉంటుంది. ఏడాదికి ఒకేసారి లేదా 12 నెలల పాటు ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు టాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ కు సంబంధించి వడ్డీని జమ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులువుగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 15 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ గడువును పెంచుకోవచ్చు.
ఈ స్కీమ్ లో 30 సంవత్సరాల పాటు 45 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా కోటీ 54 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.