మధ్య తరగతి ప్రజలలో చాలామంది డబ్బులను పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని భావించే వాళ్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే మంచిది. ఈ స్కీమ్ లో రోజుకు 100 రూపాయల చొప్పున నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.55 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బు వల్ల వేర్వేరు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఈ స్కీమ్ పై కనీసం 7 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలుగా ఉండనుంది. 35 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 55 లక్షల రూపాయలు సొంతమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 12.6 లక్షలు కాగా రాబడి మాత్రం 42 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన డబ్బులకు రుణ సౌకర్యం ఉంటుంది. పిల్లల పేరుతో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.