కోటీశ్వరులను చేసే ప్రభుత్వ స్కీమ్ ఇదే.. ఈ స్కీమ్ లో చేరితే భారీగా ఆదాయం పొందే ఛాన్స్!

loan restructuring scheme for who are not able pay emis in the covid 19 pandemic

మనలో చాలామంది కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఉంటారు. కొంతమంది ఆ కలలను సులువుగా నెరవేర్చుకుంటే మరి కొందరు మాత్రం ఆ కలలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ స్థాయిలో లాభాలు పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఏకంగా కోటి రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రతి నెలా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. నెలకు 12,500 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తంలో ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉందని తెలుస్తోంది. నెలకు 1000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత 8.17 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది.

పీపీఎఫ్ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. ఈ స్కీమ్ పై లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా సులువుగా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు.