కోటీశ్వరులను చేసే స్కీమ్ ఇదే.. రిటర్మెంట్ సమయానికి ఏకంగా రూ.3 కోట్లు?

మనలో చాలామందికి కోటీశ్వరులు కావాలనే కల ఉంటుంది. కొంతమంది ఆ కలను సులువుగా నెరవేర్చుకుంటే మరి కొందరు మాత్రం ఆ కలను నెరవేర్చుకునే విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే సరైన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో భారీగా బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. రిటైర్మెంట్ సమయానికి కోటీశ్వరులు కావాలని భావించే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఉద్యోగులు దీర్ఘకాలంలో అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ స్కీమ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న స్కీమ్ కావడం గమనార్హం. ఈపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎంత వడ్డీని పొందవచ్చో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు సైతం అదే స్థాయిలో వడ్డీని పొందవచ్చని తెలుస్తోంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో 1,50,000 వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విత్‌డ్రాయల్స్, మెచ్యూరిటీ డబ్బులకు ఎలాంటి ట్యాక్స్ లు లేకుండా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగులు అయితే ఏకంగా రెండున్నర లక్షల రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా డిపాజిట్ చేస్తే 20 సంవత్సరాలలో కోటీ 20 లక్షల రూపాయలు వస్తాయి.

ఉద్యోగులు తమ వేతనానికి అనుగుణంగా ఈ స్కీమ్స్ లో డిపాజిట్ చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. వీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన డబ్బులకు సులువుగా రిటర్న్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని డిపాజిట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.