కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుబంధు, రైతు భరోసా పేర్లతో రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. వ్యవసాయం చేసే రైతులు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే చిన్న, సన్నకారు రైతులు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు.
60 సంవత్సరాల వయస్సు పైబడిన రైతులు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు 3,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వేర్వేరు పథకాల ద్వారా ప్రయోజనాలను పొందుతున్న రైతులు మాత్రం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందలేరు.
ఈ స్కీమ్ లో చేరిన రైతులు 60 సంవత్సరాల తర్వాతే పెన్షన్ పొందే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ లో చేరే సమయానికి ఉండే వయస్సును బట్టి చెల్లించాల్సిన ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సమానంగా కేంద్రం నుంచి అదే స్థాయిలో డిపాజిట్ అవుతుంది. వయస్సు నిండిన తర్వాత రైతు మరణిస్తే భాగస్వామి సగం పొందే అవకాశం ఉంటుంది.
కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులందరికీ ఈ స్కీమ్ ద్వారా ఎన్నో లాభాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.