వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ట్రేడుల్లో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసి నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అప్రెంటీస్ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో 7700 రూపాయల నుంచి 8050 రూపాయల వరకు స్టైపెండ్ గా లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలతో పాటు షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్, ఆర్ అండ్ ఏసీ మెకానిక్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఫౌండ్రీమ్యాన్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ జాబ్స్ కు సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే మంచిది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఇండియన్ నావీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉండనుందని తెలుస్తోంది.