మనలో చాలామంది పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సరైన విధంగా పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే భారీ మొత్తంలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ పై ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ రేటు లభిస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో 100 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు.
ఈ స్కీమ్ టెన్యూర్ 5 సంవత్సరాలు కాగా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. నెలకు 1000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 71000 పొందే అవకాశం ఉంటుంది. పదేళ్లు ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే 1,69,000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. టెన్యూర్ పెంచుకునే కొద్దీ పొందే మొత్తంలో కూడా మార్పులు ఉంటాయి.
టెన్యూర్ ఆధారంగా పొందే మొత్తంలో మార్పులు ఉన్న నేపథ్యంలో ఎక్కువమంది ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేని స్కీమ్స్ కావడంతో అందరికీ ప్రయోజనకరంగా ఉండనున్నాయి. 20 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.5 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పోస్టాఫీస్ స్కీమ్స్ లో బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రయోజనం చేకూరనుంది. పోస్టాఫీస్ లో వేర్వేరు స్కీమ్స్ అందుబాటులో ఉండగా సమీపంలోని బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.